నామినేషన్ పరిశీలన ప్రక్రియ ప్రారంభం!
పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్థానిక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ లు ఆదివారంతో పూర్తి కావడంతో నామినేషన్ దాఖలు చేసిన వారి పత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను పోలీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.
రిపోర్టర్ :రెడ్డిగాని రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా