నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
నరసరావుపేట : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశించారు. గురువారం నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..