BREAKING
167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదిన వేడుకలు దుర్గా దేవి నవరాత్రి మహోత్సవములకు లక్ష రూపాయలుసహాయం అందించిన సిరమ్మ షిరిడి సాయి విద్యానికేతన్ లో గాంధీ జయంతి వేడుకలు పరుగు పందెంలో ప్రతిభ చాటిన అక్షయ.... అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్‌లో గాంధీ జయంతి వేడుకలు — నివాళులర్పించిన డిప్యూటీ సీఈవో ఇ. సందీప్ అంతర్జాతీయ వైద్య వేదికపై లక్కవరపుకోట డాక్టర్ బూర్లె మహేష్ ప్రతిభ ఘనంగా స్వచ్ఛతా దివస్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి షేక్ చాన్ బాబు గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ సర్జరీకి ఆర్థిక సాయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం గాంధీ జయంతి సందర్బంగా తాటికొండ నవీన్ 57వ రక్తదానం. ఈ నెల 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఘనంగా కోడూరు కమలాకర్ రెడ్డి, రాజా నాయుడు జన్మదిన వేడుకలు

నాగరాజుపాడులో దారుణ హత్య... చెలరేగిన పాతకక్షలు..

Select Suryaa Now
నాగరాజుపాడులో దారుణ హత్య... చెలరేగిన పాతకక్షలు..

 అన్నను హతమార్చిన తమ్ముడు…   ఆపై పోలీసులకు లొంగుబాటు…   గ్రామంలో విషాదఛాయలు…

మర్రిపాడు మేజర్ న్యూస్  :    మద్యం మత్తులో సొంత రక్తంలో పాత కక్షలు భగ్గుమన్నాయి.. ఆపై నివాసంలో ఎవరు లేని తరుణం. ఫలితంగా మద్యం సేవించి నిద్రిస్తున్న సొంత అన్నను దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. ఆ తరువాత తానే హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మర్రిపాడు  మండలం నాగరాజుపాడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన కుంభగిరి రాజగోపాల్  (46) మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తుండగా తమ్ముడు కుంభగిరి గోపి మద్యం సేవించి గురువారం అర్ధరాత్రి రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మూడేళ్ళ క్రితం అన్న రాజగోపాల్ తనను కొట్టింది మనసులో పెట్టుకొని కూలి పనులు నిమిత్తం పక్కరాస్ట్రాలకు వెళ్ళాడు. ఇటీవల భూ సమస్యపై స్వగ్రామానికి వచ్చిన గోపిహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య పదేళ్ల క్రితం మరణింంచింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత రక్తంతో పుట్టిన అన్నను హతమార్చిన తమ్ముడిని చూసి ప్రతి ఒక్కరూ నివ్వెర పోక తప్పలేదు. హత్య జరిగిందన్న సమాచారం తెలుసుకున్న ఎస్సై బలరామ్ రెడ్డి వెంటనే సిబ్బందితో కలసి నాగరాజుపాడుకు వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు తనే హత్య చేశానని పోలీసులకు లొంగిపోగా స్టేషన్ కు తరలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.