BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్ పార్టీ...

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్ పార్టీ...

అమలాపురం,మేజర్ న్యూస్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి ఆధ్వర్యంలో బాబి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో కొత్తూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించుతామని, రేపటిలోగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ గట్టిగా కృషి చేయాలని, వార్డు స్థాయిలో ప్రజలను కలుస్తూ ప్రజా సమస్యలపై గళమెత్తాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కీలక సమావేశంలో ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, పీసీసీ సభ్యులు మాచవరపు శివన్నారాయణ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వడ్డీ నాగేశ్వరరావు, కుడిపూడి శ్రీనివాసరావు, ఏలేశ్వరపు రాధాకృష్ణ, రాయుడు వెంకటరమణ, మహబూబ్ షకిల, రాయుడు గంగ భవాని, వాకపల్లి రాంబాబు, దేవరపల్లి రాజేంద్ర బాబు, అరిగెల శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొని ఎన్నికల కార్యాచరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి పార్టీని విజయపథంలో నడిపించాలని నాయకులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.