BREAKING
మల్లి వీడులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పాల్గొన్న మాజీ ఎంపీపీ గేదెల వత్సవాయి గ్రామసభలో బాల్య వివాహాల నివారణపై చర్యలు తీసుకోవాలి సిపిఎస్ రద్దు చేయాలి -పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలి తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్ లోని 48 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సిపిఎస్ ఎ ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12 మంది సన్న, చిన్నకారు రైతులకు పవర్ స్ప్రేలు పంపిణీ

Select Suryaa Now
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12 మంది సన్న, చిన్నకారు రైతులకు పవర్ స్ప్రేలు పంపిణీ

                                              దాత రంగా వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం

పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పెరవలి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12 మంది సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పనిముట్లు పవర్ స్ప్రేలను పంపిణీ చేశారు. నిడదవోలుకు చెందిన దాత రంగా వెంకటేశ్వరరావు అందించిన ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

.ఈ సందర్భంగా పెరవలి మండలం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, నిడదవోలుకు చెందిన రంగా వెంకటేశ్వరరావు అందిస్తున్న ఆర్థిక సహాయంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే పవర్ స్ప్రేలను అందించడం ఆనందంగా ఉందని, సన్న, చిన్నకారు రైతులకు ఇటువంటి సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

అనంతరం దాత రంగా వెంకటేశ్వరరావును పెరవలి మండలం లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు పొప్పుప్పు  నాగేశ్వరరావు, ట్రెజరర్ దేవరపు ఏడుకొండలు, బీజేపీ నాయకులు సింహాద్రి సత్యనారాయణ, రంగినీడి గంగాధరరావు, బల్ల లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.