BREAKING
యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి

కూటమి ప్రభుత్వం లింగాల మండలం రైతులకు ఏం చేశారో చెప్పాలి వైఎస్ఆర్సిపి నేతలు ప్రశ్నలు

Select Suryaa Now
కూటమి ప్రభుత్వం లింగాల మండలం రైతులకు ఏం చేశారో చెప్పాలి వైఎస్ఆర్సిపి నేతలు ప్రశ్నలు

మంత్రి సవిత బీటెక్ రవి వ్యాఖ్యలు హాస్యాస్పదం లింగాల రైతులకు ఏం చేశారో చెప్పాలి వైఎస్ఆర్సిపి నేతలు

అరటి రైతులకు పరిహారం ఏది? గాలి వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదని టిడిపి పై విమర్శలు

చిత్రావతిలో 10 టీఎంసీల నీరు ఎందుకు నిల్వ చేయలేదు?

రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నారా?

లింగాల మండల రైతుల సమస్యలపై టిడిపి నేతలకు వైఎస్సార్సీపీ నాయకుల ప్రశ్నలు

పులివెందుల మేజర్ న్యూస్:

తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి లు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. 
 రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని వారు చెబుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. అని వారన్నారు
రాయలసీమ గురించి పక్కన పెడితే లింగాల మండలానికి సంబంధించిన రైతులకు తెలుగుదేశం పార్టీ ఏం ఓరగ బెట్టారో చెప్పాలి. 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా రెండు సంవత్సరాలు గాలివానతో లింగాల మండలంలో వేలాది ఎకరాల అరటిపంట నేలకొరిగి రైతులు నష్టపోవడం జరిగింది. 
మంత్రి సవిత తో పాటు పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకులు అరటి పంటలను పరిశీలించారే తప్ప ప్రభుత్వం తరఫున రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదు. 
మా నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డిలు  పంట నష్టపోయిన ప్రతి రైతుకు తమ సొంత నిధులతో హెక్టార్కు 20,000 రూపాయలు అందించి రైతులకు భరోసా కల్పించారు. 
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చిత్రావతి డ్యాం కు సంబంధించి 250 కోట్లతో నాలుగు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి చిత్రావతి జలాశయంలో పది టీఎంసీల నీరును నింపడం జరిగింది. 
చిత్రావతి లో 10 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో సుమారు 1,10,000 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందింది.
-- మీ ప్రభుత్వ హయాంలో చిత్రావతిలో పది టీఎంసీల నీరు ఎందుకు నిల్వ చేయలేకపోయారో సమాధానం చెప్పాలి. 
-- మీ హయాంలో కనీసం చెరువులకు నీరు కూడా నింప లేకపోయిన విషయం ఈ ప్రాంత రైతులందరికీ తెలుసు. అని వారు పేర్కొన్నారు 
-- చెరువులకు నీరు వదలాలంటే మోటార్లు పనిచేయలేదని, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయాయని కుంటి సాకులు చెప్పారు. 
-- రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటుచేసి, మోటర్లు రిపేర్ చేయిస్తే వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న నీచ చరిత్ర మీది కాదా. 
-- రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే పాపాగ్ని నదిలో యదేచ్చగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే దాని వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే వారిపై కేసులు పెట్టించడంతో రైతుల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తోంది.
-- ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలనుకుంటే గండికోట నుంచి చిత్రావతికి 10 టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్ లో 6 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కృషి చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో లింగాల మండలం చంద్రశేఖర్ రెడ్డి అంబక పల్లె బాబు రెడ్డి రావట్ల పల్లె జగన్మోహన్ రెడ్డి నాగేంద్ర రెడ్డి అంకెవాని పల్లె భాస్కర్ రెడ్డి సాయినాథ్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు