కోనేపల్లి తండాలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
అనంతపురం బ్యూరో: మండలంలోని కోనేపల్లి తండా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, యువనేతతో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ నగదును అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వృద్ధులకు నెలకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 పెన్షన్ అందిస్తూ పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పామిడి మండల, పట్టణ నాయకులు, కోనేపల్లి తండా గ్రామస్థులు పాల్గొన్నారు.