ఖండవల్లి అంగన్వాడీలో ప్రధానమంత్రి మాతృ వందన యోజనపై అవగాహన
*అర్హులైన గర్భిణులు, బాలింతలకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు
పెరవలి మేజర్ న్యూస్ :ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా అర్హులైన గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వివరిస్తూ మొదటి కాన్పుకు 6 వేల రూపాయలు రెండవ కాన్పు కు 6 వేల రూపాయలు ప్రభుత్వ సహాయం వస్తుందని పెరవలి మండలం ఖండవల్లి అంగన్వాడి కార్యకర్తలు గర్భిణీలకు తల్లులకు అవగాహన కల్పించారు. అక్టోబర్ 1 వ తేదీ గురువారం ఖండవల్లి అంగన్వాడి సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలపై మహిళలకు అవగాహన కల్పించారు.3 నుండి 6 సంవత్సరంలోపు పిల్లలకు భేటీ బచావో బేటి పడావో పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథక ప్రయోజనాలకు దూరం కాకుండా చేయటమే తమ అంగన్వాడి లక్ష్యం అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పథకం వివరాలను చేరవేసి, అవసరమైన సహాయాన్ని అందించాలని పేర్కొన్నారు.అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేసి అర్హులైన మహిళలను గుర్తించి పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఏఎన్ఎంలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.