BREAKING
167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదిన వేడుకలు దుర్గా దేవి నవరాత్రి మహోత్సవములకు లక్ష రూపాయలుసహాయం అందించిన సిరమ్మ షిరిడి సాయి విద్యానికేతన్ లో గాంధీ జయంతి వేడుకలు పరుగు పందెంలో ప్రతిభ చాటిన అక్షయ.... అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్‌లో గాంధీ జయంతి వేడుకలు — నివాళులర్పించిన డిప్యూటీ సీఈవో ఇ. సందీప్ అంతర్జాతీయ వైద్య వేదికపై లక్కవరపుకోట డాక్టర్ బూర్లె మహేష్ ప్రతిభ ఘనంగా స్వచ్ఛతా దివస్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి షేక్ చాన్ బాబు గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ సర్జరీకి ఆర్థిక సాయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం గాంధీ జయంతి సందర్బంగా తాటికొండ నవీన్ 57వ రక్తదానం. ఈ నెల 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఘనంగా కోడూరు కమలాకర్ రెడ్డి, రాజా నాయుడు జన్మదిన వేడుకలు

కేంద్ర ఎన్నికల కమిషనర్ ఙ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

Select Suryaa Now
కేంద్ర ఎన్నికల కమిషనర్ ఙ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

రేణిగుంట: ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పేరుతో ఓటు హక్కు కలిగిన పౌరులను 13.30 కోట్ల ఓటర్లను ఏకపక్ష నిర్ణయంతో తొలగించి ఓట్ చోరీకి పాల్పడిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేణిగుంట వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, వైసిపి పార్టీ, గ్రామ పెద్దలు, ప్రజా సంఘాలతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు చిత్రపటాలతో రేణిగుంట పంచాయతీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం కు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం ను మహాత్మ గాంధీకి సమర్పించారు. 

ఈ సందర్భంగా సిపిఎం నేత కొండ్రెడ్డి హరినాథ్, వెంకటరమణ, సిపిఐ నేత వై.యస్.మణి, కార్తీక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావణ, వైసిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంకు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఆనాటి బ్రిటిష్ తెల్లదొరలను ఎదిరించి అనేకమంది ప్రాణాలు బలిదానం, త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కులం, మతం, ప్రాంతం, జాతితో నిమిత్తం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వారికి నచ్చిన పాలకులను ఎన్నుకోవడానికి ఓటు అనే ఆయుధం ను రాజ్యాంగం కల్పిస్తే ఈనాటి బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా కలిసి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పేరుతో భారత ఎన్నికల సంఘాన్ని తన చేతి గుప్పెట్లో పెట్టుకొని బీహార్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి తదితర రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన పౌరులను 13.30 కోట్ల ఓటర్లను ఏకపక్ష నిర్ణయంతో తొలగించడం దుర్మార్గమైన చర్య, రాజ్యాంగ విరుద్ధం అని, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి అనర్హుడు అని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియను బిజెపి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే భారతదేశంలో జెన్ జి యువతరంకు, దళితులు, గిరిజనులు, వలస కార్మికులు, మైనార్టీ ప్రజలు క్రిస్టియన్, ముస్లిం వర్గాల ప్రజలు పూర్తిగా తమ ఓటు హక్కు ను కోల్పోతారని హెచ్చరించారు. ఓటు చోరీ కి పాల్పడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించి తమ పదవులకు కూడా రాజీనామా చేయాలని వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, వైసిపి పార్టీ నేతలు డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వైయస్ మణి, సిపిఎం నేత వెంకటరమణ, ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావణ, వైసిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ సర్పంచి నగేష్, మాజీ వార్డ్ మెంబర్ ఎం. జి.రాజేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలు సత్య శ్రీ, మండల అధ్యక్షురాలు భారతి, పద్మమ్మ, పద్మావతి, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు కార్తీక్, సెల్వం, సిఐటియు నేతలు దీపా, రాజశేఖర్, హేమనాథ్, నారాయణ, దస్తగిరి, గిరిజన సంఘం నేతలు విజయబాబు, మునిస్వామి, సులోచన, ప్రసాద్, ప్రభాకర్, గురుమూర్తి, డప్పు కళాకారుల సంఘం వెంకటముని, విద్యాసాగర్, చెంగయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.