BREAKING
జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా

కడప జిల్లా పరిషత్ లో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ

Select Suryaa Now
కడప జిల్లా పరిషత్ లో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ

జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ..!

 

 కడప, ప్రతినిధి, వేణు.

కడప, జిల్లా పరిషత్ ఆవరణంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. 

కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రెండవ రోజు జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ తీరును, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అభ్యర్థులు ఎక్కువసేపు వేచి ఉండకుండా నామినేషన్ పత్రాలను త్వరితగతిన పరిశీలించి, అవసరమైన మార్గదర్శకాలు అందించాలని అధికారులకు సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను సజావుగా, పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, ఓటర్లు నిర్భయంగా తమ ఎన్నికల హక్కులను సద్వినియోగం చేసుకునేలా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  కడప ఆర్డీవో మురళి, కడప డిఎస్పీ భవానీ పాల్గొన్నారు.