BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివసిస్తూ కలెక్టర్ కు వినతి.

Select Suryaa Now
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివసిస్తూ కలెక్టర్ కు వినతి.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివసిస్తూ కలెక్టర్ కు వినతి. మార్కాపురం, మేజర్ న్యూస్.

 న్యూఢిల్లీలో విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరిగిన దాడులను అరికట్టాలని అలాగే బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులపై దాడులు చేసేందుకు తెగబడిన పోలీసుల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ జిల్లా శాఖలు ఆందోళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఓటర్ల జాబితాలోని అక్రమాలపై ప్రశ్నిస్తూ న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్న ఉపాధ్యాయులు రచయితలు కార్మిక సంఘ నాయకులు, వివిధ ప్రతిపక్ష పార్టీల ఆందోళన సమాచారాన్ని చేరవేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టి నిర్బంధించే ప్రయత్నం చేసిన పోలీసుల వైఖరి గర్హనీయం. మీడియా అని చెప్తున్నా వినకుండా పలువురు జర్నలిస్టుల ను అనేకచోట్ల న్యూఢిల్లీలో పోలీసులు నిర్బంధించడమే కాక దు రుసుగా వ్యవహరించడం జరిగింది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా శాఖలు నిరసన వ్యక్తం చేయాలని ఫెడరేషన్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయ సునీత కి వినతిపత్రం సమర్పించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమరికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మార్కాపురం జిల్లా నాయకులు వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొనడం జరిగినది.