గ్రామంలో పారిశుధ్య లోపం తలెత్తకుండా చర్యలు:ప్రత్యేక అధికారి సత్యనారాయణ
ఇరగవరం మేజర్ న్యూస్: ఇరగవరం మండలంలోని రేలంగి గ్రామ పంచాయతీని మండల ప్రత్యక అధికారి కె.వి.వి. సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రామంలో పర్యటించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసారు.పై ,ముఖ్యంగా శానిటేషన్ దాని పనితీరు తదితర పనుల గురించి రేలంగి పంచాయతీ అభివృద్ధి అధికారులను ప్రశ్నించారు.గ్రామంలో నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి మరియు పరిపాలనా కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమాలు, సచివాలయం ముందు నిర్వహిస్తున్న శానిటేషన్ సర్వేలు,ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి శానిటేషన్ సిబ్బంది నిరంతరం పనిచేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న సర్వేలను సమర్థవంతంగా పూర్తి చేయాలని,ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, అధికారులు మరియు సిబ్బందికి సూచించారు సమన్వయంతో పనిచేయాలని మండల అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస్ చెప్పరు. ఇరగవరం మండలంలోని గ్రామాల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది , పంచాయతీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు హాజరు అయ్యారు.
రిపోర్టర్ దొరబాబు ఇరగవరం పశ్చిమగోదావరి జిల్లా,