గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దాం :
తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత.. మధుసూదనా చారి
నెల్లూరు, వేదాయపాలెం, మేజర్ న్యూస్ : జాతిపిత మహాత్మ గాంధీజీ ఆశయాలను కొనసాగుంచాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు లోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ప్రముఖులకు మహాత్మగాంధీ శాంతి పురస్కార గ్రహీతలు అందే శ్రీనివాసులు, షేక్ రియాజ్ భాష, దొడ్డోజు విజయ నిర్మల, డాక్టర్ ఏ.వి.యస్.శ్రీధర్ కుమార్, నాగారెడ్డి విజయ నిర్మల లను ఘనంగా అవార్డుతో సత్కరించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రవి ప్రసాద్, డాక్టర్ ఎమ్.చంద్ర మోహన్ రెడ్డి, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీమోహన్ రాజు, ఉపాధ్యక్షులు రవి గోగులపల్లి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.