గజలక్ష్మి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శ్రీ ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి కోదండ రామస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రధాన వీధుల్లో కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.లక్ష్మణమూర్తి, సిహెచ్ సుధీర్ బాబు, పరిటాల వెంకట సత్యనారాయణ, పి.శరత్ బాబు, ఎస్ కిరణ్ కుమార్, కె.సురేష్ బాబు, రాజా వెంకటేష్, ఎం హరికృష్ణ,నున్న సంతోష్ కుమార్, ఆర్. సత్యనారాయణ, ఏ.వీ. రాము,సిహెచ్.తరుణ్, జి. వెంకటేశ్వర్లు, డి. శ్రీనివాసులు, శ్రీరాం శీను, టీ. చిన్న బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ బాబు, కార్యదర్శి సోమిశెట్టి కిరణ్ కుమార్, కోశాధికారి కొలిశెట్టి చంద్రమోహన్, ఆలయ చైర్మన్ దోర్నాదుల సురేష్ బాబు, కార్యదర్శి పొన్నూరు హాజరత్తయ్య, కోశాధికారి మద్దాలి సతీష్ కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించారు. అమ్మవారికి సహస్ర నామార్చనతోటి కుంకుమ పూజ జరిగింది. ఉత్సవాల్లో ఐదవ రోజైన గురువారం అమ్మవారికి శ్రీ గజలక్ష్మి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
ఉభయకర్తలుగా గ్రందే సుధాకర్ రావు, కొల్లా మల్లికార్జున రావు, నాతా సుధాకర్ బాబు, తాళ్లూరు చంద్రశేఖర రావు,శ్రీరామ్ ఈశ్వరయ్య,శ్రీరామ్ బ్రహ్మయ్య, పిచ్చయ్య, కూనిశెట్టి సాయిబాబా, బచ్చు సుధాకర్, బచ్చు సుబ్రహ్మణ్యం,పువ్వాడ చెంచయ్య, గ్రంధి సురేష్, కృష్ణ కుమార్,అమరా వెంకటేశ్వర్లు, వాయుగుండ్ల శ్రీనివాసులు, మెంట జగజీవన్ రావ్,పొన్నూరు సుబ్బారావు, వాయుగుండ్ల నారాయణ, పేర్ల సీతారామయ్య, పేర్ల వెంకట శివరాం ప్రసాద్,వనమా వెంకటేశ్వర్లు, సోమిశెట్టి సురేష్ బాబు, అలవాల మధుసూదన్ రావు, కృష్ణం హజరత్ బాబు, మెంటా సునీల్,అలవాల సుబ్రహ్మణ్యం,చందా సురేష్, ఏ. రామాంజనేయులు,పి.వి. సుమన్, చందలూరు వెంకటేశ్వర్లు,సాదు కోటేశ్వరరావు, పువ్వాడ సుబ్బారావు, ధారా వెంకటేశ్వర్లు, జీవి రత్నం, పోతులూరి మహేష్ కుమార్
వ్యవహారించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు.