BREAKING
167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదిన వేడుకలు దుర్గా దేవి నవరాత్రి మహోత్సవములకు లక్ష రూపాయలుసహాయం అందించిన సిరమ్మ షిరిడి సాయి విద్యానికేతన్ లో గాంధీ జయంతి వేడుకలు పరుగు పందెంలో ప్రతిభ చాటిన అక్షయ.... అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్‌లో గాంధీ జయంతి వేడుకలు — నివాళులర్పించిన డిప్యూటీ సీఈవో ఇ. సందీప్ అంతర్జాతీయ వైద్య వేదికపై లక్కవరపుకోట డాక్టర్ బూర్లె మహేష్ ప్రతిభ ఘనంగా స్వచ్ఛతా దివస్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థి షేక్ చాన్ బాబు గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ సర్జరీకి ఆర్థిక సాయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం గాంధీ జయంతి సందర్బంగా తాటికొండ నవీన్ 57వ రక్తదానం. ఈ నెల 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఘనంగా కోడూరు కమలాకర్ రెడ్డి, రాజా నాయుడు జన్మదిన వేడుకలు

దసరా వేళ.. ఆఫర్లజాతర..

Select Suryaa Now
దసరా వేళ.. ఆఫర్లజాతర..

వాహన..గృహప కరణాలు..ఇతర ఉత్పత్తులకు…  డిమాండ్ పెరిగే అవకాశం…  పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు విస్తృత ప్రచారాలు…  వాట్సాప్ గ్రూపులు…   ఇతర సామాజిక మాధ్యమాల్లో…  ఆఫర్ల సందడి.. మార్కెట్లో పోటాపోటీగా కొత్త.. పాత ఉత్పత్తుల ప్రదర్శన…  కొనుగోలుదారులతో మొదలైన దసరా సందడి…

నెల్లూరు, వేదాయపాలెం,  మెజర్ న్యూస్  :  దేశవ్యాప్తంగా కులమతాలకతీతంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఆహ్లాదకర కుటుంబ నేపథ్య  వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య  జరుపుకునే పర్వదినాల్లో ప్రత్యేక విశిష్టతను సంతరించుకున్న దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఆఫర్ల ప్రచార హోరు జాతర వాతావరణం తలపిస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర మున్సిపాలిటీలు.. మండల కేంద్రాలలోని వివిధ రకాలకు చెందిన వాహన కేంద్రాలు.. షోరూమ్ లు .. హోటళ్లు.. రెస్టారెంట్లు.. వస్త్ర.. బంగారం దుకాణాలు.. మొబైల్ షాపులు.. టీవీ.. ఫ్రిజ్.. కూలర్.. ఎయిర్ కండిషన్.. ఫ్యాన్ ఉంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార సంస్థల యాజమాన్యాలు దసరా పండుగ సీజన్ ను తమ ఉత్పత్తుల విక్రయాలకు అనుకూలంగా మార్చుకొని  క్యాష్ చేసుకునేందుకు ఆఫర్ల పేరుతో చేస్తున్న ప్రచారాల సందడి ఊపందికోవడంతో ఇంటా.. బయటా..ఊరు వాడ హోరెత్తిస్తున్నాయి. దసరా పండుగ వాతావరణం ఇంకా పూర్తిగా మొదలుకాకముందే వాట్సాప్ గ్రూపులు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆఫర్ల హడావిడి తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల వాహన విక్రయ షోరూంలు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఇతర వినియోగ ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యేక ధరలు.. రాయితీలు.. పండుగ ఆఫర్ల తాలూకు ప్రకటనలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఉత్పత్తులతోపాటు పాత వస్తు ఉత్పత్తుల యాజమాన్యాలు సైతం తమ ఆఫర్లను ప్రజలకు చేరవేసేందుకు పోటీ పడుతుందటంతో ఆసక్తిగా ముందుకు వస్తున్న కొనుగోలుదారుల సందడితో పలు ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల ఆవరణలన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సాధారణ రోజులతో పండుగ రోజులు పోల్చి చూస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి సంపన్న కుటుంబాల వరకు వివిధ రకాల గృహాపకరణాలు.. ఖరీదైన దుస్తులు.. ఇతరత్రా పరికరాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్నది తెలిసిన విషయమే.ఈ విషయాన్ని గ్రహించిన వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగానే మార్కెట్ లోకి దిగుమతి చేసి ప్రదర్శనలో ఉంచడంతోపాటు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయి. భోజన ప్రియులకు ఇష్టమైన చికెన్.. మటన్ విక్రయాలపై ప్రత్యేక ధరలు.. ప్యాకేజీల పేరుతో ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఫ్లెక్సీలు.. కరపత్రాలు.. నోటి మాటలకే పరిమితమైన వ్యాపార ప్రకటనలు.. ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్న వ్యాపార సంస్థలు ఒక్క వాట్సాప్ సందేశంతోనే ఆఫర్ల వివరాల తాలూకు మొత్తం సమాచారాన్ని అధిక సంఖ్యల ప్రజలకు నేరుగా చేరవేస్తుండటం విశేషం.
పోటాపోటీగా కొత్త.. పాత ఉత్పత్తులు.. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన వ్యాపార సంస్థలు దసరా పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపార అభివృద్ధిలో భాగంగా బంపర్ ఆఫర్ల పేరుతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి దిగుమతి చేస్తుంటే.. ఉనికిని కాపాడుకునేందుకు పాతవ్యాపారస్తులు తమ తమ ఉత్పత్తులను పోటాపోటీగా మార్కెట్ లో ఉంచడం తోపాటు ప్రత్యేక ధరలు.. బంపర్ ఆఫర్ల కు సంబంధించిన ట్యాగ్ లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఈనెల 20న సంతోషంగా జరుపుకోనున్న దసరా పండుగ వచ్చే లోపే సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల గృహోపకరణాలు.. వస్త్ర.. మొబైల్.. గోల్డ్.. ఇతరత్రా వినియోగ ఉత్పత్తులకు సంబంధించిన బంపర్ ఆఫర్లజాతర అన్ని వర్గాల వినియోగదారుల దృష్టిని ఆకర్షించే రీతిలో సాగుతోంది.
ఉత్పత్తుల్లో నాణ్యత ఉందా.. దసరా ఆఫర్ల ముసుగులో భారీ విక్రయాలకు సిద్ధంగా ఉన్న వివిధ రకాల ఉత్పత్తుల్లో అసలు నాణ్యత ఉందా.. లేదా అన్న విషయాన్ని ముందుగా కొనుగోలుదారులు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో విషయంలో స్పష్టమైన అవగాహన ఉండేది కాదు.. కానీ ఆధునిక టెక్నాలజీ దినధనాభివృద్ధితో అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో అనేక రకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడ ఏ వస్తువుకు సంబంధించి ఎలాంటి ఆఫర్ ఉందో.. నాణ్యత ఏ పార్టీతో స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. మార్కెట్లోకి ఆఫర్ల రూపంలో కొత్త ఉత్పత్తులు దిగుమతి కావడం.. దీంతో దీర్ఘకాలికంగా ఉన్న పాత ఉత్పత్తుల నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పడిపోకుండా కాపాడుకునేందుకు మరో అడుగు ముందుకేసి బంపర్ ఆఫర్లు ఇస్తుండటం వంటి పోటీ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల్లో అసలు నాణ్యత ఉందా.. లేదా అన్న విషయాలను ముందుగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు.. విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.