BREAKING
బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పన ఇటలీలో పడిపోయిన వ్యాపార, వినియోగదారుల విశ్వాసం కేంద్ర సిఇసి రాజీనామా చేయాలి -తక్షణం ఆయన రాజీనామా చేయాలని -తిరుపతిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ 'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో వైష్ణవికి స్వర్ణ పతకం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దసరా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అక్రమ మట్టి తవ్వకాలను ఉపేక్షించేది లేదు.... సీఈసీని అరెస్టు చేయాలి..సిపిఐ డిమాండ్ ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌పై తప్పుడు ప్రచారంపై ఫిర్యాదులు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం..ఎమ్మెల్యే అమిలినేని*

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం..ఎమ్మెల్యే అమిలినేని*

అనంతపురం బ్యూరో 

 

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం..ఎమ్మెల్యే అమిలినేని*

 *స్వంత స్థలం ఉన్న 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని*

 *అర్హులైన పేదలకు 2 సెంట్ల స్థలం కేటాయిస్తాం*

గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క సెంటులో ఇల్లు మంజూరు చేసిన అది కూడా కాంట్రాక్టర్ దోచుకోవడంతో ఎక్కడివి అక్కడ ఆగిపోయాయని కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి  2.50 లక్షల రూపాయలతో పూర్తి ఉచితంగా ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు..నేడు ప్రజావేదికలో స్థానిక నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు స్వంత స్థలం ఉన్న 80 మందికి ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ లబ్ధిదారులు తప్పకుండా 6.5 చదరాల వరకు మాత్రమే ఇంటి నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వం వారు ఇచ్చే 2.50 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి అవుతుందని, మన పట్టణంలో అసలు స్థలం లేని పేదలు కూడా చాలా మంది ఉన్నారని అలాంటి వారి కోసం కళ్యాణదుర్గం పట్టణంలోనే 15 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించామని అందులో ఒక గుట్ట ఉన్నట్లు తెలిసింది దాన్ని మా సంస్థ వారితో మాట్లాడి తొలగించి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి 2 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు..