ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో యువ నాయకుల హవా
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఒకవైపు బొమ్మిరెడ్డి తారక్ సారథ్యం, మరోవైపు చల్లా రవికుమార్ రెడ్డి నేతృత్వం,యువశక్తితో ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం ఊపందుకొనుంది. ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార బాధ్యతల్లో యువ నాయకులు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయాన్ని కాంక్షిస్తూ ఒకవైపు యువ నాయకుడు బొమ్మిరెడ్డి తారక్ సారథ్యంలో, మరోవైపు చల్లా రవికుమార్ రెడ్డి నేతృత్వంలో యువత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది.ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల్లో యువతను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేందుకు యువ నాయకులు సన్నద్ధమవుతున్నారు. సీనియర్ నాయకుల అనుభవానికి యువ నాయకత్వం ఉత్సాహం తోడవడంతో ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నూతన ఉత్సాహంలో ఆత్మకూరు ఎన్ డి ఏ కూటమి ముందుకు సాగనుంది.