BREAKING
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి ఎం ఎల్ సీ ఎన్నికల్లో విజయానికి పక్కా వ్యూహం భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టిన భారత్. ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్‌ను విధుల నుంచి తొలగించిన జేఎన్‌యూ! 28వ డివిజన్ భానునగర్‌లో పలువురు టీడీపీలో చేరిక యూపీ నుంచి 10 మంది రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక అనంతపురంలో యూజేఏసీ, వామపక్షాల, వైస్సార్సీపీ , కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ* *ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి..* *ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి – బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి* జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే గడ్డకట్టే చలిలో బైకర్‌కు అల్పాహారం అందించిన ఆర్మీ అధికారి.. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేస్తూ నెలకు రూ.60,000 సంపాదన.. పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలోనికి గంగరాజుకు చోటు. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి* రాహుల్ గాంధీ మౌనంపై స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు!

ఆర్థరైటిస్‌పై అప్రమత్తత అవసరం - నెల్లూరు అపోలో ఆధ్వర్యంలో ఘనంగా వాకథాన్

Select Suryaa Now
ఆర్థరైటిస్‌పై అప్రమత్తత అవసరం - నెల్లూరు అపోలో ఆధ్వర్యంలో ఘనంగా వాకథాన్

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్  :      అక్టోబర్ 12వ తేదీ ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కీళ్ల సమస్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శనివారం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో భారీ వాకథాన్ నిర్వహించారు. ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ నుండి ఆసుపత్రి వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. డయాబెటిస్, బీపీ కంటే తీవ్ర ప్రభావం చూపే ఆర్థరైటిస్‌ను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే శరీర వైకల్యం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం అపోలో ప్రకటించిన ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ ద్వారా రూ. 4,590 విలువైన 9 రకాల పరీక్షలను రూ. 1,999లకే, రూ. 8,590 విలువైన సమగ్ర ప్యాకేజీని రూ. 3,999లకే అందించనున్నట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ విక్రమ్ రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థరైటిస్‌లో దాదాపు 200 రకాల కీళ్ల సంబంధిత వ్యాధులు ఉంటాయని, నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది శరీరంలోని ఇతర అవయవ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, కీళ్ల నొప్పులతో బాధపడే బాధితులు ఈ రాయితీ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.