BREAKING
ప్రముఖ ఆడిటర్ మురళిని కలిసిన వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం!

ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ

Select Suryaa Now
ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ

ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్) - సింగరేణి కార్పొరేట్ ఏరియాలో ట్రేడ్స్‌మెన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.శుక్రవారం శేషగిరి భవన్‌లో జరిగిన కార్పొరేట్ ఏరియా ట్రేడ్స్‌మెన్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. టర్నర్స్, వెల్డర్స్, మిషినిస్టులకు ఫోర్‌మెన్‌గా ఎదిగే అవకాశం కల్పించాలని, యాక్టింగ్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న వారికి ఇంటర్నల్ పరీక్షకు అర్హత ఇవ్వాలని కోరారు. వర్క్‌షాపుల్లో టెక్నీషియన్లకు పనిముట్ల కొరతతో భద్రతకు ముప్పు ఏర్పడుతోందని, వెంటనే టూల్స్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కార్పొరేట్ ట్రేడ్స్‌మెన్ సబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్‌చార్జిగా రాము, అడ్వైజర్‌గా ఆనందరెడ్డి, కార్యదర్శిగా సి.హెచ్. మురళి, సహాయ కార్యదర్శులుగా రాజశేఖర్, ప్రవీణ్, వేమనాచారి తదితరులు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.