రోగం వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాలా? పేదవాడు వైద్యం కోసం అప్పులపాలవ్వాలా? ఇంకెన్నాళ్లు నేరేడుచర్ల ప్రజలకు ఈ వైద్య కష్టాలు? నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి బి ఆర్ ఎస్ నేత రాపోలు నవీన్ కుమార్
రోగం వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాలా?
పేదవాడు వైద్యం కోసం అప్పులపాలవ్వాలా?
ఇంకెన్నాళ్లు నేరేడుచర్ల ప్రజలకు ఈ వైద్య కష్టాలు?
నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి
బి ఆర్ ఎస్ నేత రాపోలు నవీన్ కుమార్ డిమాండ్
నేరేడుచర్ల మేజర్ న్యూస్
నేరేడుచర్ల పాలకవీడు గరిడేపల్లి మండలాల ప్రజల సౌకర్యార్థం నేరేడుచర్లలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని బిఆర్ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ నేత రాపోలు నవీన్ కుమార్ డిమాండ్ చేశారు మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రముందు బిఆర్ఎస్ శ్రేణులతో మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేస్తూ దశాబ్దాల కాలంగా నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నదని ఎన్ని అందువల్ల జిల్లాకు చెందిన మంత్రి చొరవ చేసుకొని ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తే ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుందని అలాగే ఈసీజీ టుడి ఎకో లాంటి మిషన్స్ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని పాముకాటు తేలుకాటు కుక్క కాటు లాంటి ప్రమాదకరమైన వాటికి మందులు అందుబాటులో ఉంచాలని 24 గంటల్లో డాక్టర్లు పర్యవేక్షణలో ఉండాలని కేవలం పగటిపూట మాత్రమే డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండి రాత్రిపూట ఎవరికీ ఏదైనా జరిగితే కేవలం వాచ్ మెన్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాడని ఇది బాధాకరమని ప్రజల యొక్క అన్ని రకాల ఇబ్బందులను పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా మార్చాలని అలాగే ఆసుపత్రి పరిధిలో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని మెడికల్ మాఫియా వారు రెండు రూపాయల ట్యాబ్లెట్లను 25 రూపాయలకు విక్రయిస్తున్నారని కూలీ చేసుకుని జీవించే వారికి అంత ఖరీదు పెట్టి మందులు కొనలేరని జెనరిక్ మెడికల్ షాపులు అయితే అందరికీ అందుబాటులో మందులు దొరుకుతాయని జీవించే హక్కులు ప్రజలకు కల్పించాలని, ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగువ జీవిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి అగ్రవర్ణాల లోని నిరుపేదలకు తక్కువ ధరలో మందులు అందాలంటే జనరిక్ మెడికల్ షాపులను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో ఏర్పాటుచేసి ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమం లో తకెళ్ళ నాగార్జున మలిగిరెడ్డి అనిల్ రెడ్డి అరే శ్రీకాంత్ పచ్చిపాల రమేష్ తమ్మిశెట్టి శివకుమార్ షేక్ రియాజ్ తమ్మిశెట్టి నరేష్ మచ్చపోతుల కృష్ణ నకిరేకంటి అభి లింగయ్య తదితరులు పాల్గొన్నారు