మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు
మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు
నేరేడుచర్ల,మేజర్ న్యూస్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ అత్తి సతీష్ నేరేడుచర్ల మండలం రామగిరి శివారు వద్ద బుధవారం బైకు అదుపుతప్పి కింద పడిపోవడముతో తీవ్రంగా గాయపడగా మిర్యాలగూడ ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారని నేరేడుచర్ల ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు. నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెం గ్రామంలోని తన ఇంటి నుంచి మిర్యాలగూడకు డ్యూటీ కి బైకుపై వెళ్తున్న అత్తి సతీష్ బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు.