BREAKING
మెట్రో నగరాలకు ఆవల కూడా క్యాన్సర్ సంరక్షణ విస్తరించాలి ప్రధాని మోదీ గుజరాత్, మహారాష్ట్ర పర్యటన.. రూ. 35 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం! సన్న వరి రైతులకు అలర్ట్.. రూ. 500 బోనస్ పొందడానికి సెప్టెంబర్ 10 చివరి గడువు! ఒడిశా అడవుల్లో అరుదైన ఒరంగుటాన్‌ల కలకలం.. భయపెడుతున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణాలు! జోధ్‌పూర్‌లో భారత్, జపాన్ ‘వీర్ గార్డియన్-2026’ వైమానిక విన్యాసాలు సింగిల్ పీస్ డెంటల్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసిన నిపుణులు కొలంబోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం జమ్మూ కాశ్మీర్‌లో కైలాష్ కుండ్ యాత్ర ప్రారంభం జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో సైనిక్ పాఠశాలల కీలక పాత్ర డ్రోన్, కౌంటర్-డ్రోన్ టెక్నాలజీలను ప్రదర్శించనున్న ఐఏఎఫ్ ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య ఎఫ్‌ఆర్‌ఐతో రూ. 5,000 కోట్లకు పైగా సైబర్ మోసాల నివారణ ఆహార ధాన్యాల నిర్వహణ ఆధునీకరణకు డీఎఫ్‌పీడీ, ఎఫ్‌సీఐ ఒప్పందం ఎఫ్‌టీ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్స్ యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్

సన్న వరి రైతులకు అలర్ట్.. రూ. 500 బోనస్ పొందడానికి సెప్టెంబర్ 10 చివరి గడువు!

Select Suryaa Now
సన్న వరి రైతులకు అలర్ట్.. రూ. 500 బోనస్ పొందడానికి సెప్టెంబర్ 10 చివరి గడువు!

తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సన్న రకం వరి సాగు చేస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ ఫలాలు పొందాలంటే రైతులు తమ పంట సాగు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి సెప్టెంబర్ 10వ తేదీని తుది గడువుగా ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. గడువు ముగిసేలోగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన రైతులకే నేరుగా బోనస్ అందేలా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టారు. రైతులు తాము కొనుగోలు చేసిన సన్న విత్తనాల వివరాలను డీలర్ల ద్వారా లేదా నేరుగా టీ-ఆగ్రిసీడ్స్ (T-Agri Seeds) పోర్టల్‌లో ఆన్‌లైన్ చేయించుకోవాలి. లైసెన్ే్సడ్ డీలర్ల వద్ద విత్తనాలు కొన్నవారు ఆ రసీదులను భద్రపరచుకోవాల్సి ఉండగా, తమ సొంత విత్తనాలను ఉపయోగించి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEO) సెల్ఫ్ డిక్లరేషన్ (స్వయం ప్రకటన) పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక సన్న రకాల సాగుకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుందని, గడువులోపు వివరాలు నమోదు చేయనియెడల బోనస్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.