ఎమ్మెల్సీల రిమాండ్ ను తిరస్కరించిన కోర్టు
ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, తాతా మధుల రిమాండ్ తిరస్కరణ*
హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, తాతా మధుసూదన్,లను రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ఎమ్మెల్సీలను కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌పై వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు రిమాండ్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ పరిణామంతో ఎమ్మెల్సీలకు ఊరట లభించింది.