కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని హైడ్రా కమిషనర్, ఐజి రంగనాథ్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనా రెడ్డి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.