దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:....
దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:....
ఎన్ఎస్ యుఐ నాయకులు చార్ల ఆంజనేయులు.....
నర్సాపూర్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై నిన్న అసెంబ్లీ ప్రాంగణం వద్ద బిఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్ఎస్ యుఐ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన స్పీకర్ పదవికి, ముఖ్యంగా ఒక దళిత నాయకుడికి అవమానం కలిగించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఎన్ఎస్ యుఐ నాయకులు చార్ల ఆంజనేయులు అన్నారు.
ఈ ఘటనకు నిరసనగా నర్సాపూర్ ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చార్ల ఆంజనేయులు మాట్లాడుతూ, “దళిత నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోము. పదవిలో ఉన్న వ్యక్తిని రాజకీయంగా విమర్శించవచ్చు కానీ వ్యక్తిగతంగా అవమానించడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని అన్నారు.తెలంగాణలో దళితులకు గౌరవం, సమానత్వం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, దళిత నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలను అయినా ఎన్ఎస్ యుఐ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు.అసెంబ్లీ వంటి పవిత్రమైన ప్రజాస్వామ్య వేదికల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని, ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు తమ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి క్షమాపణలు చెప్పాలని చార్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ నాయకులు అర్జున్, కిషోర్, లోకేష్, ప్రవీణ్ నాయక్ , ప్రవీణ్ ముదిరాజ్,లక్ష్మణ్,వేణు, సుదంష్, శ్రీనాథ్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.