BREAKING
విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు

వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు..

Select Suryaa Now
వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు..

 

సూర్య వేములవాడ రురల్:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నుంచి సుమారు 8:50 వరకు 1,05,600 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ) శ్రీనివాస్ తెలిపారు.స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.భీమన్న సన్నిధిలో వివిధ అర్జిత సేవలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు ప్రత్యేక పూజల ద్వారా (హుండీ ఆదాయం మినహాయించి) ఒక్కరోజులో రూ.52,22,473/- ఆదాయంశ్రావణ మాసంలో ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది అత్యధిక ఆదాయం దేవాలయ చరిత్రలో హుండీ ఆదాయం మినహాయించి ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది రెండవ అత్యధిక ఆదాయంగా నిలిచింది .
చివరి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ విశేషంగా నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన వివిధ అర్జిత సేవలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు మరియు ఇతర ప్రత్యేక పూజల ద్వారా (హుండీ ఆదాయం మినహాయించి) ఒక్కరోజులో రూ.52,22,473/- ఆదాయం సమకూరింది.శ్రావణ మాసంలో ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది అత్యధిక ఆదాయం కాగా, దేవాలయ చరిత్రలో హుండీ ఆదాయం మినహాయించి ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది రెండవ అత్యధిక ఆదాయంగా నిలిచింది.శ్రావణ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్జిత సేవలు నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసం, శ్రావణ మాస మహిమ ఫలితంగా ఈ విశేష ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.ఈ వివరాలను ఆలయ పీఆర్వో (PRO) శ్రీ పెరిక శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.