BREAKING
అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

గుంతలో చిక్కిన చిరుతను హతమార్చిన ముఠా

Select Suryaa Now
గుంతలో చిక్కిన చిరుతను హతమార్చిన ముఠా

చిరుత చర్మం, 17 గోర్లు విక్రయానికి యత్నం...
- నలుగురు నిందితుల అరెస్టు
- విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం క్రైమ్, సూర్య మేజర్ న్యూస్

గుంతలో పడి విలవిల్లాడుతున్న ఓ చిరుతపులిని కర్కశంగా చంపి, దాని చర్మం, గోర్లను అమ్ముకునేందుకు యత్నించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... గత ఏడాది వేసవిలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి గుంతలో పడిపోయింది. బయటకు రాలేని స్థితిలో చిక్కుకున్న దాన్ని నిందితులు రాళ్లు, కర్రలతో కొట్టి, బాణాలు సంధించి పొట్టనబెట్టుకున్నారు. అనంతరం చర్మం వలిచి ఎండబెట్టి, గోర్లను దాచిపెట్టారని తెలిపారు.
*బేరసారాలు.. బట్టబయలు:* 
చిరుత చర్మం, గోర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించిన సారపాకకు చెందిన చల్లా అనిల్‌కుమార్, భూమి కౌలు వ్యవహారంలో పరిచయమైన గమ్మలకోటకు చెందిన కుంజ భద్రయ్యను సంప్రదించాడు. కొనుగోలుదారులను చూపిస్తానని అనిల్ చెప్పడంతో భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్యలు చర్మం, గోర్లను బ్యాగ్‌లో పెట్టుకుని తాళ్లగొమ్మూరుకు వచ్చారు. అయితే ముందుగానే సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ ఎస్‌ఐ ఇ.నాగ బిక్షం నేతృత్వంలోని పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం ఉమ్మడిగా దాడి చేసి నలుగురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఎండిన చిరుతపులి చర్మం, 17 గోర్లు, వాటి రవాణాకు వాడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరు, సారపాక చెందిన చల్లా అనిల్‌కుమార్, పోలవరం జిల్లా చింతూరు మండలం, గమ్మలకోటకు చెందిన కుంజా భద్రయ్య, అదే ప్రాంతానికి మరో ఇద్దరు నిందితులు కుంజా గంగరాజు, మడవి కన్నయ్య లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, టాస్క్‌ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్సైలు నాగ బిక్షం, ప్రవీణ్, సుమన్‌తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.