BREAKING
సీఎం విజయ్ కీలక నిర్ణయాలు మణిపూర్‌లో మీరా పైబీ జ్యోతి ర్యాలీ మహిళల ఆత్మగౌరవంతోనే దేశాభివృద్ధి ‘ఛాత్రోన్ కీ గూంజ్’పై బీజేపీ ఆగ్రహం లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు ఎంపీ బంపర్ ఆఫర్? దానాపూర్‌లో మునిగిన గ్రామాలు, పాఠశాలలు నాగ్‌పూర్‌లో నీటి శుద్ధి కర్మాగారంలో క్లోరిన్ గ్యాస్ లీక్ కనిజా ఓపెన్ చెస్ విజేతగా భారత్‌కు చెందిన ప్రణేష్ ఉక్రెయిన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ బులియన్ మార్కెట్‌లో మళ్లీ బంగారం, వెండి జిగేల్ TVK ఇంకా 'ఫ్యాన్ క్లబ్' మైండ్ సెట్‌లోనే ఉంది 22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీదే

మహిళల ఆత్మగౌరవంతోనే దేశాభివృద్ధి

Select Suryaa Now
మహిళల ఆత్మగౌరవంతోనే దేశాభివృద్ధి

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎంపీ మల్లు రవి మద్దతు
హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహిళల హక్కులు మరియు వారి స్వతంత్రతపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంపూర్ణ మద్దతు తెలిపారు. మనుధర్మంలోని పరాధీన తత్వ భావజాలం భారతీయ సమాజాన్ని, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా బలహీనపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

పురుషులతో సమానంగా సాధించే సామర్థ్యం ఉన్నప్పటికీ, పురుషుల కంటే తాము తక్కువ అనే మానసిక భావన (సామాజిక రుద్దింపు) వల్లే మహిళలు వెనుకబడిపోతున్నారని, ఈ రకమైన ఆలోచనా విధానం దేశంలో మహిళా సాధికారతను అణచివేస్తోందని అన్నారు.

తండ్రి, భర్త, కుమారుడిని గౌరవిస్తూనే.. పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వతంత్రంగా ఆలోచించి, తమ నిర్ణయాలు తాము తీసుకునే హక్కును వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ బహిరంగ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఈ మార్పు భారతీయ సమాజంలో ఒక "రక్తపాతరహిత విప్లవాన్ని" తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళల ఆలోచనా విధానంలో ఈ ఆత్మవిశ్వాసంతో కూడిన మార్పు వచ్చినప్పుడే దేశంలో అపారమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.