కనిజా ఓపెన్ చెస్ విజేతగా భారత్‌కు చెందిన ప్రణేష్
మధ్య ఐరోపాలో అత్యంత పోటీతత్వంతో కూడిన ప్రతిష్టాత్మక 'కనిజా ఓపెన్ 2026' చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్ ఎం కైవసం చేసుకున్నారు. హంగరీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఉత్కంఠభరితంగా సాగిన 9వ రౌండ్ ముగిసేసరికి ఆయన అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్‌గా అవతరించారు.
ప్రణేష్ సాధించిన ఈ ఘనతపై హంగరీలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా స్పందిస్తూ అభినందనలు తెలిపింది. "ప్రపంచ వేదికపై భారత ప్రతిభ ఇంత ప్రకాశవంతంగా వెలుగుతుండటం చూసి మేము చాలా గర్వపడుతున్నాము. భారత చెస్‌కు హంగరీ ఒక అదృష్ట క్షేత్రంగా కొనసాగుతోంది. అతని చెస్ ప్రయాణంలో నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసించింది.