లండన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now

రేపు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ బయలుదేరారు. పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాలు, పెట్టుబడుల చర్చల్లో పాల్గొన్న ఆయన, తిరుగు ప్రయాణమయ్యారు.

రేపు ఉదయం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో శంషాబాద్ ఏయిర్‌పోర్ట్ వద్ద అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.