BREAKING
TVK ఇంకా 'ఫ్యాన్ క్లబ్' మైండ్ సెట్‌లోనే ఉంది 22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీదే మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్న ఆన్ సే-యంగ్ హైదరాబాద్‌లో వింత ఘటన: ప్రియురాలికి 'కిడ్నాప్' ప్రాంక్ మెసేజ్.. కట్ చేస్తే రూ. 30 లక్షల బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు! లండన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి పడిక్కల్ ఖాతాలో వరుసగా రెండో సెంచరీ.. తొలి రోజు భారత్ 300/5 నామినేటెడ్ పదవుల్లో పాత నేతలకు 80%, కొత్త వారికి 20% ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మంత్రి పొన్నం భరోసా.. బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాకే గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం

22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం

Select Suryaa Now
22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం

తెలంగాణ ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక
హైదరాబాద్: సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బిఆర్ఎస్ (BRS) సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు 22A (నిషేధిత భూముల జాబితా) సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తానీరు హరీష్ రావు డిమాండ్ చేశారు.

లేకపోతే శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, అసెంబ్లీని ఎలా నడుపుతారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. 22A నిబంధనల వల్ల అనేకమంది భూయజమానులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి వెంటనే న్యాయం చేయాలని పేర్కొన్నారు.

బాధిత ప్రజలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై శాసనసభ లోపల, వెలుపల పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.