బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి
బిసి రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి
అందుకు రాజ్యంగ సవరణ చేయాలి
దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 50% పరిమితి అడ్డంకి
ఎస్సీ, ఎస్టీ లకు జనాభా ప్రకారం ఇవ్వాలని రాజ్యాంగంలో స్సష్టం
రాజ్యాంగంలో 243-డి జనాభా ప్రకారం అని స్పష్టంగా పేర్కొనక పోవడం వల్లే ఇబ్బందులు
ఏపీలో 34% రిజర్వేషన్లు కల్పించడం హర్షనీయం
ఏపీ సీఎం చంద్రబాబు చిరవ తీసుకొని కూటమి నేతలతో చర్చించాలి
బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత కల్పించాలని, అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితి ప్రధాన అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ లకు జనాభా ప్రకారం ఇవ్వాలని రాజ్యాంగంలో యుంది. కాని బి.సి లకు రాజ్యాంగంలోని 243-డి జనాభా ప్రకారం అని స్పష్టంగా పేర్కొనక పోవడం వలన అనేక న్యాయపరమైన అవరోదాలు ఏర్పడుతున్నాయి. దీనిని అదిగమించడానికి రాజ్యాంగ సవరణయే పరిష్కారం. ఈ పరిమితి తొలగించడానికి జనాభా ప్రకారం ఇవ్వడానికి రాజ్యాంగ సవరణయే ఒకటే మార్గం అని పేర్కొన్నారు. అలాగే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకొని అసెంబ్లీ పాస్ చేసిన చట్టం చేయడం పట్ల ఆర్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ను అభినందించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా లేఖ రాశారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందింఛి రాజ్యాంగపరంగా పరిష్కరించాలి. తెలంగాణ, బీహార్ లో కులగణన, డెడికేషన్ కమీషన్ల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టినప్పటికీ 50 శాతం పరిమితిని దాటిదని బి.సి రిజర్వేషన్లను కోర్టు కొట్టి వేసింది. అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక తదితర రాష్ట్రాలలో కోర్టు జోక్యం చేసుకొని 50 శాతం పరిమితి దాటిందని కొట్టి వేశారు. దీనికి రాజ్యాంగ సవరణ జరుగాలి. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావలంటే రాజ్యాంగ బద్ధంగా ఉండాలి. లేకపోతే ఎన్నికల హామీ కోసం తీసుకున్న నిర్ణయమే న్యాయస్థానంలో నిలబడకుండా పోతుంది. ఇక్కడ లోతుగా ఆలోచించాల్సిన రాజ్యాంగపరమైన కోణం ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితి దాటి రిజర్వేషన్లు అమలు చేయాలంటే లేదా ఆ సీలింగ్ పరిమితిని మార్చాలంటే పార్లమెంటులోనే రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. ఇదే శాశ్వత పరిష్కారం ఇది రాష్ట్ర ప్రభుత్వాల జీవోలతో సాధ్యమయ్యే పని కాదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు పార్లమెంటులో ఆ రాజ్యాంగ సవరణ చేయించే అధికారం, అవకాశం ఉన్నాయి. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలంటే సీఎం చంద్రబా బు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావాలని కోరా రు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి రాజ్యాంగ సవరణ చేయాలి. దేశంలోని బి.సి వర్గానికి చెందిన చెందిన ప్రధానమంత్రి యున్నారు అలాగే బి.సి.ల పార్టీగా ముద్రపడ్డ తెలుగుదేశం నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయాలనీ కోరారు. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అని కృష్ణయ్య పేర్కొన్నారు.