లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. లండన్‌లో కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, క్రీడా మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు సానుకూలంగా సాగాయని సీఎం తెలిపారు.
తొలుత లండన్ నుంచి అమెరికా (బోస్టన్) పర్యటనకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో అమెరికా పర్యటన రద్దయింది. దీంతో ఆయన నేరుగా హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
సీఎం విదేశాంగ పర్యటన నిలిచిపోయినప్పటికీ, తన వెంట వచ్చిన అధికారుల బృందాన్ని అమెరికా పర్యటనకు పంపి, హార్వర్డ్, MIT వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో ఒప్పందాలు (MoUs) పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేంద్రం అనుమతి నిరాకరించడంపై శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.