BREAKING
'అర్చన 31 నాటౌట్' (ఈటీవీ విన్) రివ్యూ! యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు :భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్ గుంతలో చిక్కిన చిరుతను హతమార్చిన ముఠా ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ.. ప్రపంచ మార్కెట్లే లక్ష్యం: సీఎం చంద్రబాబు కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి

యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు :భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్

Select Suryaa Now
యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు :భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి...

-భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్...
భద్రాచలం ఆర్సి (సూర్య మేజర్ న్యూస్):- 
భద్రాచలం జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ భద్రాచల పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ అరుణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి ప్రభావం, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు..
ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు విద్యార్థులు, యువత ఎట్టి పరిస్థితుల్లోనూ బానిస కావద్దని సూచించారు. డ్రగ్స్ మొదట సరదాగా లేదా స్నేహితుల ఒత్తిడితో ప్రారంభమైనప్పటికీ, క్రమంగా తీవ్రమైన వ్యసనంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంతో పాటు చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. డ్రగ్స్ విక్రయించే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు, ప్రజలు డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. విద్యార్థులు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.4వ వార్డు మెంబర్, ఎస్ఎఫ్ఐ పట్టణ ఇంచార్జ్ బండారు శరత్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో చదువు అత్యంత ముఖ్యమైనదని, తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి చదవాలని అన్నారు. తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని సూచించారు.యువత ఏ దేశానికైనా ప్రధానమైన శక్తి అని, అలాంటి యువత డ్రగ్స్‌కు బానిస అయితే సమాజం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. అందువల్ల డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని కేవలం పోలీసు శాఖకే పరిమితం చేయకుండా ప్రభుత్వం, విద్యాశాఖ, పోలీసు శాఖ, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాలు కలిసి ముందుకు సాగాలని కోరారు.ఎస్ఎఫ్ఐ భద్రాచల పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కూడా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా తమ తోటి విద్యార్థులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ వ్యాప్తికి ప్రధాన కారణాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా విద్యాసంస్థలు, కళాశాలలు, హాస్టళ్లు మరియు యువత ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.