BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి

Select Suryaa Now
లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి

ఏపీ లారీ అసోసియేషన్ ఆగ్రహం!
విశాఖపట్నం:విశాఖపట్నంలో రవాణా శాఖ తనిఖీల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ భౌతిక దాడికి పాల్పడటంతో వివాదం చెలరేగింది.

విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో తనిఖీల కోసం అధికారులు సంకేతం ఇచ్చినప్పటికీ ఓ లారీ ఆపకుండా ముందుకు వెళ్ళిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి వాహన డ్రైవర్, ఆ లారీని వేగంగా ఓవర్‌టేక్ చేసి అడ్డుకున్నాడు. అనంతరం లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దారుణంగా దాడికి పాల్పడ్డాడు.

లారీ అసోసియేషన్ నిరసన
విధి నిర్వహణ పేరుతో రవాణా శాఖ సిబ్బంది లారీ డ్రైవర్‌పై భౌతిక దాడికి దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నాకు సిద్ధమయ్యారు.