ఆయుర్వేద థెరపీ కోసం కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Select Suryaa Now

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయుర్వేద చికిత్స నిమిత్తం శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన కుడి భుజానికి 'రొటేటర్ కఫ్' శస్త్రచికిత్స జరిగింది.

అయితే, సర్జరీ జరిగిన భుజం భాగంలో వాపు పెరగడంతో పాటు ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయనకు ఆయుర్వేద థెరపీ తీసుకోవాల్సిందిగా సూచించారు. వైద్యుల సలహా మేరకు ఆయన కేరళలోని ప్రముఖ ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్స పొందనున్నారు.