జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి
జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళిబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన బావమరిది స్వర్గీయ జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
జోగినపల్లి శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంపల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించిన దశదిన కర్మ (కర్మకాండలు) కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. అక్కడే ఉన్న శ్రీనివాసరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అనంతరం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కేసీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.