BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు!

Select Suryaa Now
బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు!

కర్ణాటకలోని మండ్యలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఓ వృద్ధురాలు మృతి చెందగా, ఆమె ఇంట్లో తనిఖీ చేయగా భారీగా నగదు బయటపడింది.

మండ్యకు చెందిన హూర్ (68) అనే వృద్ధురాలు జీవితాంతం భిక్షాటన చేస్తూనే కాలం వెళ్లదీసింది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

కుటుంబసభ్యులు ఆమె ఇంలోకి వెళ్లి పరిశీలించగా.. అక్కడ ఉన్న పరిస్థితి చూసి అవాక్కయ్యారు. ఇంట్లో దాదాపు 30కి పైగా సంచుల్లో వేలకొద్దీ నాణేలు, నోట్ల కట్టలు నిల్వ ఉంచి ఉన్నాయి. ఆ డబ్బును లెక్కించగా మొత్తం రూ. 8,40,000 ఉన్నట్లు తేలింది.

అనంతరం ఆ మొత్తంలో నుంచి ఆమె సోదరుల్లో ఒకరు రూ. 6 లక్షలు తీసుకోగా, మిగిలిన డబ్బును కుటుంబసభ్యులు మసీదుకు విరాళంగా అందజేశారు. భిక్షాటన చేస్తూ ఎవరికీ భారంగా మారకుండా బతికిన ఆ వృద్ధురాలు అంత పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవడం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.