సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్!
వరంగల్:వరంగల్‌లోని ఉర్సు గుట్ట వద్ద విధి నిర్వహణలో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన బీట్ కానిస్టేబుల్‌పై వరంగల్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు తీసుకుంది.
ఉర్సు గుట్ట ప్రాంతంలో విధుల్లో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్‌పై, బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి ఘటనను వరంగల్ సీపీ తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసుల మధ్యే ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ దాడికి సంబంధించి సంతోష్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా నమోదైంది. పోలీసు శాఖలో క్రమశిక్షణారాహిత్యానికి తావులేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని సీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.