BREAKING
*అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టిసి వరుణ్ అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

రేవంత్ రెడ్డి సిరిసిల్లకు రానున్న నేపథ్యంలో బి ఆర్ ఏస్ నాయకుల ముందస్తు అరెస్టు.

Select Suryaa Now
రేవంత్ రెడ్డి సిరిసిల్లకు రానున్న నేపథ్యంలో బి ఆర్ ఏస్ నాయకుల ముందస్తు అరెస్టు.

సూర్య, ఇల్లంతకుంట: సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా తమను అదుపులోకి తీసుకున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

అరెస్టులపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న గొంతులను పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.సీఎం సిరిసిల్లకు వస్తున్నారనే కారణంతో తమను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్టు చేయించారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతున్నందుకే తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం సరికాదని వారు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును, నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాపాడాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమను అరెస్టు చేయడం ద్వారా తమ ప్రజాస్వామ్య హక్కులను హరించారని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు.

ముందస్తుగా అరెస్టయిన వారిలో అనంతగిరి మాజీ ఎంపీటీసీ గొట్టిపర్తి పర్శరాములు, ఏండ్ర చందన్, రడం ప్రవీణ్, రాగటి రమేష్, కేశవేణి శ్రీనివాస్, బాలగౌడ్ పట్నం శ్రీనివాస్, గుంటి మధు, పట్నం మహేందర్ తదితరులు ఉన్నారు.