telanagana
పెద్ద చెట్లలో ఉండే రంధ్రాలు పాలపిట్టల ఆవాసాలు - ఎఫ్డిఓ రామ్మోహన్
సూర్య, జన్నారం : వ్యవసాయానికి హాని చేసే ఎన్నో కీటకాలను తినేసే పాలపిట్టలను రైతు నేస్తం గా అభివర్ణిస్తారని, వ్యవసాయ రంగంలో పురుగు మందుల విచక్షణారహిత వినియోగంతో పాలపిట్టల ప్రధాన ఆహారమైన కీటకాలు, పురుగులు తగ్గిపోయి పాలపిట్టల జనాభాలు క్షీణిస్తున్నాయని, పెద్ద చెట్లలో రంధ్రాలు పాలపిట్టల ఆవాసాలని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ తెలిపారు. జన్నారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ విలువైన చెట్ల తొలగింపు వాటి ఆవాసం నాశనానికి మరియు వాటి గూళ్ళ తొలగింపుకు కారణమై వాటి జననం, సంతాన అభివృద్ధి దెబ్బతింటుందని అన్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న నగరీకరణ పాలపిట్టల ఆవాస నష్టాన్ని మరింత వేగిర పరుస్తుందని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల కంటే పాక్షిక పట్టణ ప్రాంతాలలో పాలపిట్టల జనాభాలు చాలా వరకు తగ్గాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కనిపించే పాలపిట్టలు నేడు రోజురోజుకు కనుమరుగవుతుండటంతో దసరా పండుగ సమయంలో వాటిని బంధించడానికి దారి తీస్తుందని అన్నారు.