BREAKING
హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..! కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్ దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒకతార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ది ప్యారడైజ్ మాస్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నాని సూర్య సీన్ టైటిల్ గ్లింప్స్ విడుదల.. దీపావళికి థియేటర్లలోకి అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు* రాకేష్ వర్రే మాయలేడి మూవీ టీజర్ విడుదల.. అక్టోబర్‌లో థియేటర్లలోకి ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం వ్యక్తిపై దాడి స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి

కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు

Select Suryaa Now
కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు

 

'వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన’ అంటూ నిరసన

విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందించాలని డిమాండ్‌.. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం

దోమ,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 17):వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ రైతులు గురువారం రోడ్డెక్కారు. విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ మోత్కూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ‘వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన’ అంటూ నినాదాలు చేశారు.రైతులు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు బోరుబావులపై ఆధారపడుతున్నామని తెలిపారు. పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న విద్యుత్‌ సరఫరాకు, క్షేత్రస్థాయిలో అందుతున్న సరఫరాకు పొంతన లేదని ఆరోపించారు.‘రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదు’, ‘రైతు ఏడిస్తే రాజ్యమే ఏడుస్తుంది’ అంటూ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్యపై ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతోనే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. ఈ క్రమంలో రైతులు, విద్యుత్‌ అధికారుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కరించే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని రైతులు స్పష్టం చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పక్కకు వెళ్లాలని రైతులను కోరినప్పటికీ, విద్యుత్‌ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన కొనసాగించారు.ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మోత్కూర్‌ గ్రామానికి వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా, నిరంతరాయంగా అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పేర్కొంటూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ ఆందోళనలో మోత్కూర్‌ గ్రామ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.