BREAKING
మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో జోడిగా స్నేహ.. విడుదల తేదీపై మేకర్స్ స్పష్టత నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన పారదర్శక పాలన.. సామాజిక న్యాయం.. సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వెంకటస్వామి గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మంత్రి దామోదర్ రాజా నరసింహ స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు* తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ​గన్ పార్క్ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్

గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు

Select Suryaa Now
గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు

గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు

పటాన్ చెరు ; సేవా స్ఫూర్తిని, శ్రద్ధను చాటుతూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హౌస్ కీపింగ్ విభాగం ‘ప్రతి శుభ్రమైన ప్రదేశం వెనుక, శ్రద్ధ వహించే ఒక బృందం ఉంటుంది’ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు 2026ను ఘనంగా జరుపుకుంది.ప్రాంగణం పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా, ఆహ్వానించదగినదిగా ఉంచడానికి తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే అంకితభావం గల బృందాన్ని ఈ వేడుక గుర్తించింది. వారి పని తరచుగా గుర్తించకపోవచ్చు, బహుశా అదే మంచి సేవకు గొప్ప నిదర్శనం. ప్రతిదీ సజావుగా సాగినప్పుడు, దానిని సాకారం చేసే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు.హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, హౌస్ కీపింగ్ బృందం యొక్క నిబద్ధతను, బాధ్యతను ప్రశంసించగా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, సజావైన ప్రాంగణ అనుభవాన్ని సృష్టించడంలో వారి సహకారాన్ని గుర్తించారు.గణేష వందనతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, వారం రోజుల పాటు జరిగే వేడుకల వీడియోను ప్రదర్శించారు. వినోదభరితమైన ఆటలు, బహుమతుల పంపిణీ, ఆ తరువాత హౌస్ కీపింగ్ బృంద సభ్యులతో ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమం జరిగాయి.తేనీరు విందుతో కూడిన ఆత్మీయ సమావేశంతో ఈ వేడుక ముగిసింది. దీంతో హౌస్ కీపింగ్ బృందం తాము విలువైనవారిగా, గౌరవించబడిన వారిగా భావించింది. దాని సందేశం చాలా సరళమైనది, గొప్ప సేవ అంటే ఎల్లప్పుడూ కనిపించడం కాదు, అది శ్రద్ధ చూపడం, నిలకడగా ఉంటం, ప్రతి అనుభవాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చేయడం.