ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
*ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*
*అభివృద్ధి, సంక్షేమంలో జనగామ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది*
*ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య*
జనగామ జిల్లా సూర్య ప్రతినిధి సెప్టెంబర్ 17, మేజర్ న్యూస్,
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని *ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య* అన్నారు.
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో *తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ* వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణిలతో కలిసి ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య* హాజరయ్యారు.
ముందుగా విద్యార్థుల బృందంచే జాతీయ గేయాలాపన చేశారు. ఆ వెంటనే *ముఖ్య అతిథి* జాతీయ జెండాను ఎగురవేశారు. వెనువెంటనే జాతీయ గీతం ఆలపించారు. తదనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని *ముఖ్య అతిథి* స్వీకరించారు. తదుపరి తెలంగాణ రాష్ట్ర గీతావళి ఆలపించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి *ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్* మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజని అన్నారు. 78 వసంతాలు పూర్తి చేసుకున్నామని, 79వ వసంతంలోకి అడుగు పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతోందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.
జనగామ జిల్లా విద్య, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలుస్తోందని కొనియాడారు. నిరంతరం ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టి, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు అందిస్తూ, విజయవంతంగా ఆరు గ్యారెంటీల పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నామని వెల్లడించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల
వేడుకల్లో భాగంగా గణపతి, నమో నరసింహ – మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సూడు సూడు సుక్కలు చూడు – ఎంజేపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలికలు), బచ్చన్నపేట, అడ్డేడు అడ్డేడు మల్లెలు నా తెలంగాణ – సెయింట్ పాల్స్ స్కూల్, జనగామ విద్యార్థుల నృత్యాలు వీక్షకులను అలరించాయి.
కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.