సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్
-ఇన్‌స్టాగ్రామ్ వల..రూ.22.80 లక్షలు హాంఫట్
-రూ.1.44 కోట్ల లాభం వచ్చిందంటూ బురిడీ
-‘ట్యాక్స్’ పేరుతో మరో రూ.25 లక్షలకు ఎర
-APK ఫైల్‌తో మరో మోసం..ఇద్దరు నిందితుల అరెస్ట్
-రూ.25 లక్షల నగదు,4 సెల్‌ఫోన్లు,ల్యాప్‌టాప్ స్వాధీనం
....మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల పరిధిలో నమోదైన రెండు సైబర్ మోసం కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుడి ఫోన్‌కు APK ఫైల్ పంపి ఓపెన్ చేయించడంతో ఫోన్‌ను హ్యాక్ చేసి, ఖాతాలో జమ అయిన రూ.5.24 లక్షలను వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అలాగే ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో నకిలీ యాప్‌లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలను మోసం చేసి, అమాయకుల బ్యాంకు కరెంట్ ఖాతాలను సేకరించి సైబర్ మోసాల సొమ్మును వాటిలోకి బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కోవెలకుంట్ల సీఐ పి. హనుమంత నాయక్ ఆధ్వర్యంలో సాంకేతిక దర్యాప్తు చేపట్టి సెప్టెంబర్ 17న ఉదయం 10.30 గంటలకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి **రూ.25 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్** స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.