హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 17:
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చారిత్రక చిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేతులు జోడించి నమస్కరిస్తున్న అప్పటి నిజమైన చారిత్రక ఫొటోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూపిస్తూ దాని విశేషాలను ఉపరాష్ట్రపతికి వివరించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టానికి సంబంధించిన ఈ ఫొటో ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచింది.