ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
వికలాంగులకు ట్రే సైకిల్ పంపిణీ
ఎమ్మిగనూరు సూర్యప్రతినిధి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదిన వేడుకలను ఎమ్మిగనూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వైభవంగా జరుపుకున్నారు. గురువారం మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజా దేశాయ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెలరోజుల సేవా కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు 16 మందికి సైకిళ్ళు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గురురాజా దేశాయి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అన్నారు. నిన్న చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ ఆర్థిక అభివృద్ధిని బాగుపరుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజాప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.