ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ నాసిర్ అహ్మద్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నేతలు వారితో పాటు కలిసి మైనార్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని వివరించారు. మైనార్టీల అండ దండలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని స్పష్టం చేశారు. మైనార్టీల స్థితిగతులపై కమిటీ ప్రత్యేకంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని వెల్లడించారు.