నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
అనంతపురం బ్యూరో,
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆర్తో వార్డు వద్ద అతను మృతి చెంది ఉండడం తో స్థానికులు గుర్తించి ఆసుపత్రి వర్గాలకు వెల్లడించాయి. దీంతో మృతుడు నగర శివారులోని నందమూరి నగర్ కు చెందిన నటేష్ (50) గా గుర్తించారు. అతనికి బుధవారం విషపు పురుగు కాటు వేయడంతో ఆసుపత్రిలో చేరాడని అన్నారు. ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నటాన్ని గుర్తించి ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.