దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం
నంద్యాల అర్బన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఆయుష్ జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ యశోద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు కు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ
ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని అభిరుచి మధు తెలిపారు. ప్రజలందరూ నరేంద్రమోదీకి సంపూర్ణ ఆరోగ్యం, నిండు నూరేళ్ళు జీవించాలని ఆశీర్వదించాలన్నారు. ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం ఒక దీపం వెలిగించి వారిని ఆశీర్వదించాలని అభిరుచి మధు కోరారు.